Andhra Pradesh : ఏపీలో దారుణ ఘటన.. టెన్త్ క్లాస్ బాలికను రంపంతో కోసిన ఉన్మాది
Andhra Pradesh : ఏపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని రాప్తాడు మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్మాది వీరంగం సృష్టించాడు. రంపంతో పదో తరగతి చదువుతున్న బాలికపై రంపంతో దాడి చేశాడు. క్లాస్‌రూమ్‌లోనే ఈ దారుణ ఘటనకు పాల్పడ్డాడు. Also Read : YS Sharmila : యలహంక ప్యాలెస్ వివాదంపై వైఎస్ ష

Andhra Pradesh : ఏపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని రాప్తాడు మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్మాది వీరంగం సృష్టించాడు. రంపంతో పదో తరగతి చదువుతున్న బాలికపై రంపంతో దాడి చేశాడు. క్లాస్‌రూమ్‌లోనే ఈ దారుణ ఘటనకు పాల్పడ్డాడు. Also Read : YS Sharmila : యలహంక ప్యాలెస్ వివాదంపై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్.. బైక్ పై వచ్చిన ఉన్మాది నేరుగా పదవ తరగతి క్లాస్ రూమ్ లోకి వెళ్లాడు. ఎలక్ట్రిక్ రంపంతో విచక్షణ రహితంగా బాలికపై దాడి చేశాడు. దీంతో విద్యార్థిని కుడిచేయి తెగిపోగా, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన మరో బాలికపైనా ఉన్మాది దాడికి పాల్పడ్డాడు. ఉదయం 10.30గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో క్లాస్ రూమ్ లో టీచర్ కూడా ఉన్నారు. అందరూ చూస్తుండగానే బాలికపై దాడికి తెగబడ్డాడు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. చికిత్స నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. బాలికది అయ్యవారిపల్లెగా తెలుస్తోంది. మరోవైపు.. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.