Annadata Sukhibhava: ఏపీ రైతులకు సూపర్ గుడ్ న్యూస్.. ఆరోజే అకౌంట్ లోకి రూ.6,000.. దీపావళి కానుకగా ప్రభుత్వం సన్నాహాలు
Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 40 లక్షల మందికి పైగా రైతులకు ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించనుంది. అన్నదాత సుఖీభవ(Annadata Sukhibhava), కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించిన రెండో విడత నిధులను అక్టోబర్ 30వ తేదీన విడుదల చేసేందుకు ముమ్మర సన్నాహాలు జరుగుతున

Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 40 లక్షల మందికి పైగా రైతులకు ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించనుంది. అన్నదాత సుఖీభవ(Annadata Sukhibhava), కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించిన రెండో విడత నిధులను అక్టోబర్ 30వ తేదీన విడుదల చేసేందుకు ముమ్మర సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో అక్టోబర్ 17న ఈ నిధులు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ కొన్ని అనివార్య సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడ్డాయి. ఈ నేపధ్యంలో దీపావళి పండుగ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ.4,000, అలాగే పీఎం కిసాన్ కింద రూ.2,000 కలిపి మొత్తం రూ.6,000లను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. భూమి ఉన్న రైతులతో పాటు సీసీఆర్సీ కార్డులు కలిగిన అర్హులైన కౌలు రైతులకు కూడా ఈ పథకం లబ్ధి వర్తిస్తుంది. CM Chandrababu: ఏపీ బ్రాండ్ దెబ్బతీసే కుట్ర.. అవే అబద్ధాలు, అవే అరాచకాలు.. వైసీపీపై సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్ మీ పేమెంట్, బెనిఫిషియరీ స్టేటస్ ఆన్లైన్లో తనిఖీ చేసుకోండి: రైతులు తమ పథకం అర్హత, నిధుల జమ వివరాలను ఆన్లైన్ ద్వారా చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ‘అన్నదాత సుఖీభవ’ అధికారిక పోర్టల్‌లోకి వెళ్లి “Know Your Status” ఆప్షన్ ఎంచుకుని, ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయడం ద్వారా మీ వివరాలు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ (pmkisan.gov.in) ద్వారా కూడా “Know Your Status” విభాగాన్ని ఎంచుకుని, రిజిస్ట్రేషన్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేసి పేమెంట్ స్టేటస్‌ను సులభంగా నిర్ధారించుకోవచ్చు. నిధులు పొందడానికి రైతులు విధిగా చేసుకోవాల్సిన ముఖ్యమైన అప్డేట్లు: ఖాతాల్లోకి నిధులు ఎటువంటి అడ్డంకులు లేకుండా సజావుగా జమ కావడానికి ప్రభుత్వం పలు ముఖ్య సూచనలు చేసింది. రైతులు తమ బ్యాంక్ ఖాతాకు ఎన్పీసీఐ (NPCI) మ్యాపింగ్ పూర్తయిందో లేదో ముందస్తుగా తనిఖీ చేసుకోవాలి. దీంతో పాటు ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్, ఆధార్ ఆధారిత e-KYC ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి. ఈ ముఖ్యమైన సాంకేతిక వివరాలన్నీ సక్రమంగా ఉన్న అర్హులైన రైతు కుటుంబాల అకౌంట్లలోకి మాత్రమే రెండో విడత నిధులు జమ కానున్నాయి.