Ap Freehold Lands: అసైన్డ్, ఇనాం, పట్టా భూములపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. 60 రోజులే డెడ్‌లైన్.. కొత్త జీవో జారీ!
Ap Freehold Lands: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములకు సంబంధించి ఫ్రీహోల్డ్ దరఖాస్తుల వేగవంతమైన పరిష్కారానికి అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులు, భూ యజమానుల సుదీర్ఘకాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు స్పష్టమైన మార్గ

Ap Freehold Lands: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములకు సంబంధించి ఫ్రీహోల్డ్ దరఖాస్తుల వేగవంతమైన పరిష్కారానికి అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులు, భూ యజమానుల సుదీర్ఘకాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు స్పష్టమైన మార్గదర్శకాలతో నూతన జీవోను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం దరఖాస్తులను తహసీల్దార్ నుంచి ఆర్డీవో స్థాయి వరకు గరిష్టంగా 60 రోజుల వ్యవధిలోనే తప్పనిసరిగా పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. Amit Shah: తెలంగాణలో బీజేపీదే అధికారం.. రేవంత్ రెడ్డి సీఎం ఎలా అయ్యారు? రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీపై అమిత్ షా ఫైర్ నిషేధిత జాబితా నుంచి భూములకు విముక్తి.. ‘వెబ్‌ల్యాండ్’లో తక్షణ మార్పులు: నిషేధిత భూముల జాబితా నుంచి ఈ భూములను(Ap Freehold Lands) తొలగించడానికి ఎలాంటి ప్రత్యేక లేదా అదనపు ఉత్తర్వులు అవసరం లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. అర్హత కలిగిన భూముల వివరాలను ఏపీ రెవెన్యూ పోర్టల్ ‘వెబ్‌ల్యాండ్’లో తక్షణమే అప్డేట్ చేయాలని ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్‌ను ఆదేశించింది. 60 రోజుల కాలపరిమితి విధించడంతో రెవెన్యూ ప్రక్రియలో ఆలస్యం తగ్గి, పారదర్శకత గణనీయంగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. రైతులకు ఆర్థిక వెసులుబాటు.. క్రయవిక్రయాలు, బ్యాంకింగ్ రుణాలకు మార్గం సుగమం: ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంతో భూములపై రైతులకు పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు లభిస్తాయి. దీనివల్ల రైతులు తమ భూములను అవసరాలకు అనుగుణంగా విక్రయించుకోవడానికి, బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి లేదా ఇతరులకు బదిలీ చేయడానికి మార్గం సుగమమైంది.