AP ZPTC MPTC Elections : మూడు మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వాయిదా.. రాష్ట్ర వ్యాప్తంగా యథావిధిగా పోలింగ్..
AP ZPTC MPTC Elections : ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ గురువారం యథావిధిగా కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్రపునేఠా తెలిపారు. అయితే, గుంటూరు జిల్లాలోని మూడు మండలాల్లో మాత్రం పోలింగ్ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. Also Read : Jagapathi Babu Sister : సినీ నటుడ

AP ZPTC MPTC Elections : ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ గురువారం యథావిధిగా కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్రపునేఠా తెలిపారు. అయితే, గుంటూరు జిల్లాలోని మూడు మండలాల్లో మాత్రం పోలింగ్ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. Also Read : Jagapathi Babu Sister : సినీ నటుడు జగపతిబాబు చెల్లెలు ఘన విజయం.. మెజార్టీ ఎంతంటే? అనిల్ చంద్రపునేఠా బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. వర్షాలు తగ్గుముఖం పట్టాయని, పోలింగ్ నిర్వహణకు ఇబ్బంది లేదని మెజార్టీ కలెక్టర్లు సూచించడంతో ఈనెల 5న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ యథావిధిగా నిర్వహించేందుకు ఎస్ఈసీ నిర్ణయించారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మురసు తుపాను ప్రభావం నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు, కాకుమాను, ఫిరంగిపురం మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. వర్షాలు, వరదల నేపథ్యంలో పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సామాగ్రి తీసుకెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నిలక సంఘం ఆదేశాల మేరకు గురువారం జరగాల్సిన పోలింగ్ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఇదిలాఉంటే.. ఈనెల 5న జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31,472 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలింగ్ ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. ఎన్నికల అధికారులు 1,841 అత్యంత సమస్యాత్మక, 2,645 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఆయా కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించనున్నారు. ఎన్నికల ప్రక్రియను సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా పర్యవేక్షించనున్నారు. అల్లర్లు, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులు నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. శాంతియుత వాతావరణంలో పోలింగ్ పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.