Arnab Cyclone Alert: ఏపీకి ‘అర్ణబ్’ తుఫాన్ ముప్పు.. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. విశాఖ-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం!
Arnab Cyclone Alert: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారడంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా జిల్లాలకు తీవ్ర తుఫాన్ ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. పశ్చిమ వాయువ్య దిశగా వేగంగా కదులుతున్న ఈ తీవ్ర వాయుగుండం అక్టోబర్ 26న ఉదయానికి తుఫాన్గ

Arnab Cyclone Alert: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారడంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా జిల్లాలకు తీవ్ర తుఫాన్ ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. పశ్చిమ వాయువ్య దిశగా వేగంగా కదులుతున్న ఈ తీవ్ర వాయుగుండం అక్టోబర్ 26న ఉదయానికి తుఫాన్‌గా రూపాంతరం చెందే అవకాశం ఉందని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. ఈ తుఫాన్‌కు ‘అర్ణబ్(Arnab Cyclone Alert)’గా నామకరణం చేయనుండగా, ఇది అక్టోబర్ 28వ తేదీ మధ్యాహ్న సమయానికి మచిలీపట్నం – విశాఖపట్నం మధ్య తీరం దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ తీవ్రత కారణంగా అక్టోబర్ 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా గాలులు, వర్షాల తీవ్రత విపరీతంగా పెరగనుంది. Vizianagaram: విజయనగరంలో బొత్స ఫ్యామిలీకి బిగ్ షాక్.. పూసపాటిరేగ జెడ్పీటీసీ నామినేషన్ తిరస్కరణ తీరం వెంబడి గంటకు 120 కి.మీ వేగంతో ఈదురుగాలులు.. మత్స్యకారులకు హెచ్చరికలు: తుఫాన్ ప్రభావంతో సముద్రం తీవ్రంగా అలజడిగా మారనుందని, తీర ప్రాంతాల్లో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా అక్టోబర్ 27, 28 తేదీల్లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారే అవకాశముంది. ఈ క్రమంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే సురక్షిత ప్రాంతాలకు, తీరానికి తిరిగి రావాలని అధికారులు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమాదకర పరిస్థితులు తలెత్తకుండా తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఏపీలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్‌లు.. అప్రమత్తమైన రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ: తుఫాన్ గండం పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వివిధ జిల్లాలకు హైఅలెర్ట్ ప్రకటనలు విడుదల చేసింది. అక్టోబర్ 27న కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు తీవ్ర వర్ష సూచనతో ‘రెడ్ అలెర్ట్’ ప్రకటించగా, తుఫాన్ తీరం దాటే సమయంలో విశాఖపట్నం నుంచి బాపట్ల వరకు గల తీర జిల్లాల్లో అత్యంత తీవ్ర ప్రభావం ఉండనుండటంతో ఆయా ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ కొనసాగనుంది. అలాగే అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ‘ఆరెంజ్ బులెటిన్’, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ‘ఎల్లో వార్నింగ్’ జారీ చేశారు. ప్రజలందరూ తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటూ అధికారిక ఆదేశాలను పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.