CJP Leaders Custody : సీజేపీ నేతలకు మరో షాక్.. ఇంకో రెండు రోజులు జైల్లోనే!
జంతర్‌మంతర్ నిరసన ఎఫెక్ట్.. సౌరవ్ దాస్, రాంకాకు తప్పని జైలు కష్టాలు ఐదు రోజులు జైలులో.. ఇప్పుడు మరో రెండు రోజులు సీజేపీ నేతల విడుదలకు బ్రేక్.. కస్టడీ పొడిగించిన ఎస్ఈఎం CJP Leaders Custody : కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాకు మరోసారి నిరాశ ఎదురైంది. ఇప్పటికే 5

జంతర్‌మంతర్ నిరసన ఎఫెక్ట్.. సౌరవ్ దాస్, రాంకాకు తప్పని జైలు కష్టాలు ఐదు రోజులు జైలులో.. ఇప్పుడు మరో రెండు రోజులు సీజేపీ నేతల విడుదలకు బ్రేక్.. కస్టడీ పొడిగించిన ఎస్ఈఎం CJP Leaders Custody : కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాకు మరోసారి నిరాశ ఎదురైంది. ఇప్పటికే 5 రోజులుగా జైలులో ఉన్న వీరిద్దరి జ్యుడీషియల్ కస్టడీని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ (SEM) మరో రెండు రోజులు పొడిగించారు. దీంతో సీజేపీ నేతలు బుధవారం (అక్టోబర్ 21) వరకు తిహాడ్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. జంతర్‌మంతర్ నిరసన.. అరెస్టుతో మొదలైన చిక్కులు : కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ సీజేపీ ఇటీవల దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఈ క్రమంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్దకు అనుమతి లేకుండా చేరుకున్నారనే ఆరోపణలతో పాటు, ఓ ప్రైవేటు ప్రాంగణంలోకి చొరబడ్డారనే అభియోగాలపై సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని న్యాయాధికారి ఎదుట హాజరుపరచగా, ఈ నెల 14న 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. దీంతో ఇద్దరినీ తిహాడ్ జైలుకు తరలించారు. కస్టడీ గడువు ముగియడంతో పోలీసులు తాజాగా మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్లో కొత్తగా నియమితులైన ఎస్ఈఎం ఎదుట వారిని హాజరుపరిచారు. కస్టడీని మరింత పొడిగించాలని కోరగా, మరో రెండు రోజుల పాటు జైలులో ఉంచాలని ఎస్ఈఎం ఆదేశించారు. Read Also : Telangana Eagle Force : మహారాష్ట్రలో రహస్య డ్రగ్స్ ల్యాబ్.. తెలంగాణ ఈగల్ ఫోర్స్ దెబ్బకు కదిలిన డ్రగ్స్ మాఫియా! ఉన్నత న్యాయస్థానానికి వెళ్తాం : రత్నసింగ్ తాజా నిర్ణయంపై సీజేపీ ప్రతినిధి రత్నసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కస్టడీకి సంబంధించి తమ వాదనలను చట్టపరంగా వినిపించినప్పటికీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిరాధార ఆరోపణలతో ఎదురుదాడికి దిగారని పేర్కొన్నారు. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు ఇప్పటికే 5 రోజులు జైలులో గడిపారని, ష్యూరిటీ వెరిఫికేషన్ అవసరమనే కారణంతో వారి స్వేచ్ఛను పరిమితం చేయడం సరికాదని రత్నసింగ్ అభిప్రాయపడ్డారు. తాజాగా మరోసారి కస్టడీకి పంపాల్సిన అవసరం లేదని పేర్కొంటూ, ఈ నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానాల్లో సవాలు చేస్తామని స్పష్టం చేశారు. కస్టడీ పొడిగింపుతో సీజేపీ నేతల విడుదల మరింత ఆలస్యమైంది. తదుపరి న్యాయపరమైన పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.