Cyclone Information : ఏపీ ప్రజలకు అలర్ట్.. తుపాను సమాచారాన్ని ఇకపై ఆన్లైన్లోనే ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?
Cyclone Information : బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్‌ను అందుబాటులో ఉంచింది. ఈ పోర్టల్ ద్వారా తుపాను కదలికలు, తీరాన్ని దాటే అవకాశాలు, గాలుల వేగం

Cyclone Information : బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్‌ను అందుబాటులో ఉంచింది. ఈ పోర్టల్ ద్వారా తుపాను కదలికలు, తీరాన్ని దాటే అవకాశాలు, గాలుల వేగం, ప్రభావిత జిల్లాల వివరాలను పరిశీలించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. Also Read : School Holidays : అర్నబ్ తుపాన్ ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు, రేపు విద్యా సంస్థలకు సెలవులు.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రూపొందించిన తుఫాను సమాచార నిర్వహణ వ్యవస్థ (Cyclone Information Management System) ద్వారా బంగాళాఖాతంలో తుపాను ప్రస్తుత స్థితి, దాని అంచనా ప్రయాణ మార్గం, తీవ్రతలో మార్పులు, ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశాలకు సంబంధించిన వివరాలను చూడవచ్చు. అంతేకాదు.. తుపాను కదలికలు, గాలుల వేగం, తీరాన్ని ఎప్పుడు, ఏ ప్రాంతం సమీపంలో దాటుతుంది, తుపాను ప్రభావం ఏ జిల్లాపై ఎంత స్థాయిలో ఉంటుంది, వాతావరణ నమూనాల ఆధారంగా తుపాను ప్రయాణించే అవకాశం ఉన్న మార్గం తదితర విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే.. మొబైల్ ఫోన్ లేదంటే కంప్యూటర్లో https://apsdmagis.ap.gov.in/weather-watch/lite.html ఈలింక్ను తెరిచి తుపాను సమాచారాన్ని పరిశీలించవచ్చు. ఈ పోర్టల్‌లోని సమాచారం వాతావరణ నమూనాల ఆధారంగా రూపొందించే అంచనాలను కూడా కలిగి ఉంటుంది. కాబట్టి అధికారిక వాతావరణ హెచ్చరికల కోసం భారత వాతావరణ శాఖ (IMD) బులెటిన్లు, జిల్లా యంత్రాంగం జారీ చేసే సూచనలనే అనుసరించాలి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలు అధికారులు సూచించిన జాగ్రత్తలు పాటించాలి. సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు ఇచ్చే హెచ్చరికలను తప్పనిసరిగా అనుసరించాలి. వాతావరణ పరిస్థితులపై తాజా సమాచారం కోసం అధికారిక పోర్టల్‌తో పాటు ప్రభుత్వ హెచ్చరికలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించాలి.