Cyclone Murasu: అల్లకల్లోలంగా సముద్రం.. అర్ధరాత్రి తీరం దాటనున్న ‘మురసు’ తీవ్ర తుపాను.. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!
Cyclone Murasu: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తీవ్ర తుపాను అత్యంత వేగంగా ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం వైపు దూసుకొస్తోంది. గడచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ తీవ్ర తుపాను, సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఆంధ్రప

Cyclone Murasu: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తీవ్ర తుపాను అత్యంత వేగంగా ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం వైపు దూసుకొస్తోంది. గడచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ తీవ్ర తుపాను, సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA), ఆర్టీజీఎస్ ప్రకటించాయి. సాయంత్రం వేళకు అందిన తాజా సమాచారం ప్రకారం ఇది నెల్లూరుకు 80 కిలోమీటర్లు, కావలికి 90 కిలోమీటర్లు, ఒంగోలుకు 120 కిలోమీటర్లు, బాపట్లకు 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను తీరానికి దగ్గరవుతున్న కొద్దీ దక్షిణ కోస్తా తీరప్రాంతం సముద్రపు అలల ఉద్ధృతితో అల్లకల్లోలంగా మారింది. Ap Local Body Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శాతం విడుదల.. 62.16% ఓటింగ్ నమోదు.. హైయెస్ట్, లోయెస్ట్ ఎక్కడో తెలుసా? 8 జిల్లాలకు రెడ్ అలర్ట్.. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడనున్న పెనుగాలులు: ‘మురసు(Cyclone Murasu)’ తుపాను ప్రభావంతో పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. తుపాను తీరం దాటే కీలక సమయంలో తీరం వెంబడి గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో పెనుగాలులు వీస్తాయని వెల్లడించారు. ఈ ఈదురుగాలుల ధాటికి భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యే ప్రమాదం ఉన్నందున విద్యుత్, రవాణా, రెవెన్యూ యంత్రాంగాలను సన్నద్ధం చేశారు. విపత్తుల నిర్వహణ సంస్థ తీవ్ర హెచ్చరికలు.. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్: తుపాను ముప్పు ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో తీరప్రాంత ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ పిలుపునిచ్చారు. తీరం దాటే సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, లోతట్టు ప్రాంత వాసులు తక్షణమే ప్రభుత్వ సహాయ పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లవద్దని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రభావిత జిల్లాల్లో 6 ఎన్డీఆర్ఎఫ్, 7 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచడంతో పాటు, ‘వాట్సాప్ మనమిత్ర’ (9552300009) సేవలు మరియు కంట్రోల్ రూమ్ నంబర్లను నిరంతరం అందుబాటులో ఉంచారు.