Election Commission Of India: 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. నవంబర్ 30 డెడ్‌లైన్.. కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ఆదేశాలు
Election Commission Of India: వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల నిర్వహణలో సంపూర్ణ పారదర్శకత, నిష్పాక్షికతను కాపాడే లక్ష్యంతో ఆయా రాష్ట్రాల్లో పనిచేస్తున్న పరిపాల

Election Commission Of India: వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల నిర్వహణలో సంపూర్ణ పారదర్శకత, నిష్పాక్షికతను కాపాడే లక్ష్యంతో ఆయా రాష్ట్రాల్లో పనిచేస్తున్న పరిపాలనా, పోలీసు అధికారుల బదిలీలకు ఆదేశాలు జారీ చేసింది. గత నాలుగేళ్ల కాలంలో ఒకే జిల్లాలో మూడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం పనిచేసిన అధికారులను తక్షణమే వేరే జిల్లాలకు బదిలీ చేయాలని ఐదు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఈసీ(Election Commission Of India) ఆదేశించింది. Supreme Court: వైఎస్సార్సీపీకి సుప్రీంకోర్టులో ఊహించని షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్ కొట్టివేత.. ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్! పోలీస్, రవాణా, ఎక్సైజ్ శాఖలకు బదిలీల వేటు.. ఎన్నికల విధుల్లో ఉండే అందరికీ నిబంధన వర్తింపు: ఈ బదిలీల ప్రక్రియ కేవలం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వంటి ఉన్నతాధికారులకే కాకుండా ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పాల్గొనే ఇతర కీలక శాఖల అధికారులకు కూడా వర్తించనుంది. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్, రవాణా, ఎక్సైజ్ శాఖల్లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న సిబ్బందిని తప్పక స్థానచలనం చేయాలని స్పష్టం చేసింది. ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా చూడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. నవంబర్ 30 గడువు.. నివేదిక సమర్పించాలని రాష్ట్రాల సీఎస్‌లకు సీఈసీ ఆదేశం: ఎన్నికల సంఘం జారీ చేసిన ఈ బదిలీల ప్రక్రియను నవంబర్ 30వ తేదీ నాటికి పూర్తి చేసి, దానికి సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను పంపాలని ఆదేశించింది. గతంలో అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇవే తరహా మార్గదర్శకాలను పాటించిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ కఠిన నిర్ణయంతో ఐదు రాష్ట్రాల రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.