Hyderabad Traffic Alert : హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్.. చార్మినార్ వైపు వెళ్తున్నారా? ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!
హైదరాబాద్‌లో వాహనదారులకు అలర్ట్.. చార్మినార్‌కు వెళ్లేవారికి పోలీసుల హెచ్చరిక.. ఈ మార్గాల్లో వాహనాల దారి మళ్లింపు దీపావళి వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్ టెన్షన్.. Hyderabad Traffic Alert : దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ పాతబస్తీ అంతా సందడిగా మారుతుంది. ముఖ్యంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో జనా

హైదరాబాద్‌లో వాహనదారులకు అలర్ట్.. చార్మినార్‌కు వెళ్లేవారికి పోలీసుల హెచ్చరిక.. ఈ మార్గాల్లో వాహనాల దారి మళ్లింపు దీపావళి వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్ టెన్షన్.. Hyderabad Traffic Alert : దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ పాతబస్తీ అంతా సందడిగా మారుతుంది. ముఖ్యంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో జనాల రద్దీ మామూలుగా ఉండదు. పండుగ కొనుగోళ్లు, ఆలయ దర్శనాలు, ప్రత్యేక పూజలతో ఈ ప్రాంతం కిటకిటలాడుతుంది. ఈ నేపథ్యంలో వాహనదారులకు నగర ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు.. శుక్రవారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ముఖ్యంగా శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి (Hyderabad Traffic Alert) ఆలయానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా, అదే సమయంలో సాధారణ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు రాకుండా వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించనున్నారు.. Read Also : Blinkit Ambulance Service : ఫ్రీ అంబులెన్స్ సేవలకు బ్రేక్.. ఇప్పుడు రూ.2,500 ఛార్జీ! బ్లింకిట్ కొత్త రూల్ వెనుక అసలు రీజన్ ఇదే! ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు.. : మదీనా నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను నేరుగా అనుమతించకుండా దారి మళ్లించనున్నారు. అలాగే ముర్గీ చౌక్ నుంచి చార్మినార్ ప్రధాన కూడలికి వెళ్లే మార్గంలోనూ ఆంక్షలు ఉండనున్నాయి. షాలిబండ నుంచి చార్మినార్ వైపు వెళ్లే రహదారిలో పాదచారులకు, అనుమతి ఉన్న వాహనాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వనున్నారు.. వాహనదారులు ఇలా ప్లాన్ చేసుకోండి : పండుగ సమయంలో పాతబస్తీ మార్కెట్లకు వెళ్లే వారి సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే చార్మినార్ పరిసర ప్రాంతాల మీదుగా ప్రయాణించే వారు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిది. వీలైనంత వరకు ప్రత్యామ్నాయ బైపాస్ మార్గాలను ఎంచుకోవాలి. అత్యవసర పనులు ఉంటే రద్దీ సమయాల్లో ఈ ప్రాంతానికి వెళ్లకుండా చూసుకోవాలి. మొత్తానికి పండుగ వేళ ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించుకోవాలంటే పోలీసుల సూచనలు పాటించడం మంచిది. కాస్త ముందస్తు జాగ్రత్త తీసుకుంటే ప్రయాణ సమయం ఆదా అవ్వడమే కాకుండా అనవసరమైన టెన్షన్ కూడా తప్పుతుంది..