Meerpet Tragedy: మీర్పేట్లో ఘోరం.. కత్తితో అత్త, తోటి కోడలిపై దాడి చేసిన అల్లుడు.. ఇద్దరు అక్కడికక్కడే మృతి!
Meerpet Tragedy: హైదరాబాద్ నగర శివారులోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్షణికావేశంలో కసాయిగా మారిన ఒక అల్లుడు, సొంత బంధువులపైనే కత్తులతో విచక్షణారహితంగా దాడికి దిగాడు. జయశ్రీ కాలనీలో బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ దారుణ మారణకాండ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గత కొ

Meerpet Tragedy: హైదరాబాద్ నగర శివారులోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్షణికావేశంలో కసాయిగా మారిన ఒక అల్లుడు, సొంత బంధువులపైనే కత్తులతో విచక్షణారహితంగా దాడికి దిగాడు. జయశ్రీ కాలనీలో బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ దారుణ మారణకాండ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గత కొంతకాలంగా సాగుతున్న కుటుంబ అంతర్గత కలహాల నేపథ్యంలో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు, పదునైన కత్తితో ఇంట్లోని వారిపై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో అడ్డువచ్చిన అత్త నిరంజన్ బీ, బావమరిది భార్య రేష్మ రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. Maa Indiramma Intlo Dewali: ఈసారి ‘ఇందిరమ్మ ఇళ్లలో’ దీపావళి వేడుకలు.. నిరుపేదల ముంగిట్లో పండుగ వెలుగులు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం ముగ్గురికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రిలో ఒకరి పరిస్థితి విషమం: ఈ దారుణ ఘటనలో నిందితుడి భార్య, కుమార్తెతో పాటు బావమరిది యూసుఫ్ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర రక్తస్రావమైన యూసుఫ్‌ను స్థానికులు తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న మీర్పేట్ పోలీసులు, సీపీ, క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం (Meerpet Tragedy)నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కాగా, పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో తీవ్రంగా గాలిస్తున్నారు. ఉదయమే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.. పోలీసులపై బంధువుల ఆగ్రహం: ఈ దారుణానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితుడి నుంచి తమకు ప్రాణహాని ఉందని బుధవారం ఉదయమే మీర్పేట్ పీఎస్‌కు వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఇద్దరి ప్రాణాలు దక్కేవని రోదించారు. ప్రశాంతమైన కాలనీలో ఇద్దరు బలవ్వడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.