New Movie Opening : కొత్త సినిమా ఓపెనింగ్.. క్లాప్ కొట్టిన చంద్రబోస్..
New Movie Opening : సకల సమృద్ధిఆర్ట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా కనుమూరి ప్రసాద్ రాజు నిర్మాణంలో గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో నేడు కొత్త సినిమా ఓపెనింగ్ పూజ కార్యక్రమం నిర్వహించారు. రాజీవ్ వర్మ, మలైకా టి. వాసుపాల్ జంటగా ఈ సినిమా తెరకెక్కుతుంది. సినిమా ఓపెనింగ్ కి గెస్ట్ గా హాజరయిన పాటల రచ

New Movie Opening : సకల సమృద్ధిఆర్ట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా కనుమూరి ప్రసాద్ రాజు నిర్మాణంలో గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో నేడు కొత్త సినిమా ఓపెనింగ్ పూజ కార్యక్రమం నిర్వహించారు. రాజీవ్ వర్మ, మలైకా టి. వాసుపాల్ జంటగా ఈ సినిమా తెరకెక్కుతుంది. సినిమా ఓపెనింగ్ కి గెస్ట్ గా హాజరయిన పాటల రచయిత చంద్రబోస్ క్లాప్ కొట్టారు. నిర్మాత కనుమూరి ప్రసాద్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, చిత్ర దర్శకుడు గౌతమ్ ప్రసాద్ యల్లపు ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. Also See : Prabhas Sister : ట్రెడిషినల్ లుక్స్‌లో ప్రభాస్ చెల్లెల్లు.. ప్రసీద ఉప్పలపాటి ఫొటోలు.. ఈ సినిమా షూటింగ్ నవంబర్ 12 నుంచి మొదలు కానుంది. ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, కుమనన్, జెమిని సురేష్, రమణ భార్గవ్, శివాజీ రాజా, ఆయూషి.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఇవ్వనున్నారు. హైదరాబాద్‌లో ఈ షూటింగ్ జరగనుంది. నాలుగు షెడ్యూల్స్‌లో ఈ సినిమా షూటింగ్ ముగించే ప్లాన్ చేస్తున్నారు. మిగిలిన షెడ్యూల్స్ కోనసీమ పరిసర ప్రాంతంలో జరుగనున్నాయి. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్లో ప్రేమ కథ చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.