NZ vs IND : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో వన్డే మ్యాచ్.. బ్యాటింగ్ ప్రారంభం.. 47 ఓవర్లు మాత్రమే.. కారణం ఇదే..
NZ vs IND 2nd ODI : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా రెండో వన్డే శనివారం ఉదయం ప్రారంభమైంది. వాస్తవానికి ఉదయం 7.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. దీంతో మ్యాచ్ ను అంపైర్లు 47 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన టీమిండియా కెప్టె

NZ vs IND 2nd ODI : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా రెండో వన్డే శనివారం ఉదయం ప్రారంభమైంది. వాస్తవానికి ఉదయం 7.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. దీంతో మ్యాచ్ ను అంపైర్లు 47 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకొని న్యూజిలాండ్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. Also Read : Mohammed Shami : టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మొహమ్మద్ షమీ.. 13ఏళ్ల ప్రయాణానికి ముగింపు! భావోద్వేగ పోస్ట్ రెండో వన్డేలో భారత జట్టు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. జట్టు వివరాలు : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, నమన్ ధిర్, అన్షుల్ కాంబోజ్, అకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్ న్యూజిలాండ్ జట్టు : విల్ యంగ్, టిమ్ సీఫర్ట్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లేథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, కేల్ జేమీసన్, జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నర్ #TeamIndia have won the toss and elect to bowl first in the 2nd ODI at Hnry Stadium, Wellington. Same XI as the first game for Live – https://t.co/pxZRYf6dYV #NZvIND https://t.co/6D0MpgXuZh — BCCI (@BCCI) November 7, 2026 మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే న్యూజిలాండ్ జట్టు వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. కేవలం 11 పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ తొలి ఓవర్‌ను మెయిడిన్ చేయగా.. రెండో ఓవర్ ను అకిబ్ నబీ వేశాడు. ఈ ఓవర్లో కివీస్ బ్యాటర్ టీమ్ సీఫర్ట్‌ను డకౌట్ చేశాడు. అకిబ్ వేసిన ఐదో బంతికి సీఫర్ట్ షాట్ కొట్టే ప్రయత్నంలో మిడాన్‌లో అన్షుల్ కాంబోజ్ సూపర్ క్యాచ్ పట్టేశాడు. దీంతో కివీస్ 2 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. దీంతో భారత బౌలర్ అకిబ్ నబీకి అంతర్జాతీయ వన్డేల్లో తొలి వికెట్ దక్కింది. రెండో వికెట్ కూడా అకిబ్ నబీనే తీసుకున్నాడు. విల్ యంగ్ (6) షాట్ ఆడే ప్రయత్నంలో బంతి ఎడ్జ్ తీసుకొని వెనక్కు వెళ్లింది. ఆ బంతిని కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో 11 పరుగులకే కివీస్ రెండు వికెట్లు కోల్పోయింది.