Rapthadu Accused Hemant : రాప్తాడు నిందితుడు హేమంత్ ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్.. వైద్యులు చెప్పిన విషయాలివే..
Rapthadu Accused Hemant Health update : శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు జడ్పీహెచ్ఎస్లో శనివారం పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడిచేసిన ఉన్మాది హేమంత్ పై పోలీసుల బృందం కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో రెండు కాళ్లపై ఆరు బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో తీవ్రంగా గాయపడిన నిందితుడిని ఆదివారం

Rapthadu Accused Hemant Health update : శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు జడ్పీహెచ్ఎస్లో శనివారం పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడిచేసిన ఉన్మాది హేమంత్ పై పోలీసుల బృందం కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో రెండు కాళ్లపై ఆరు బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో తీవ్రంగా గాయపడిన నిందితుడిని ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో పోలీసులు అంబులెన్సులో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాజాగా.. నిందితుడు హేమంత్ ఆరోగ్య పరిస్థితిపై అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కీలక అప్డేట్ వెల్లడించారు. Also Read : బతికించండి సార్.. దండం పెడతా.. పోలీసులను వేడుకున్న రాప్తాడు నిందితుడు.. అస్పత్రిలో ప్రస్తుతం అతని పరిస్థితి ఇదే.. వీడియో వైరల్ ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి తెలిపారు. వైద్యులు అడిగిన ప్రశ్నలకు హేమంత్ సమాధానాలు చెబుతున్నాడని, తన పేరు అడిగితే హేమంత్ అని చెబుతున్నట్లు వెల్లడించారు. అయితే, హేమంత్ కుడికాలుకు తీవ్ర గాయం కావడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కాలుకు రక్త ప్రసరణ తగ్గిందని, ఇదే పరిస్థితి కొనసాగితే కుడికాలు తొలగించాల్సిన అవసరం రావచ్చని సూపరింటెండెంట్ తెలిపారు. రక్త సరఫరా సక్రమంగా ఉంటేనే నరాలు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయని, రక్త ప్రసరణ లేకపోతే కండరాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని వివరించారు. హేమంత్ రెండు కాళ్లలో బుల్లెట్లు ఉన్నాయనే అనుమానంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అయితే ఎక్స్‌రే పరీక్షల్లో కాళ్లలో బుల్లెట్లు కనిపించలేదని సర్జరీ వైద్యులు వెల్లడించినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. ప్రస్తుతం రెండు కాళ్లకు ఎక్స్‌రేలు తీసి నివేదికలను పరిశీలిస్తున్నారు. హేమంత్ ఆరోగ్య పరిస్థితిని అనస్తీషియా వైద్యుడు పరిశీలించారు. ఎక్స్‌రే నివేదికలు, అనస్తీషియా వైద్యుడి పరిశీలన ఆధారంగా ఆర్థోపెడిక్, న్యూరాలజీ వైద్యులు తదుపరి చికిత్సపై నిర్ణయం తీసుకోనున్నారు. మరికొద్దిసేపట్లో అతడిని ఆపరేషన్ థియేటర్‌కు తరలించి శస్త్రచికిత్స నిర్వహించేందుకు వైద్యులు సిద్ధమవుతున్నారు. కుడికాలుకు రక్త ప్రసరణ ఎందుకు తగ్గిందనే విషయం ఆపరేషన్ థియేటర్లో పరిశీలించిన తర్వాతే స్పష్టమవుతుందని డాక్టర్ మల్లీశ్వరి తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం కాలును కాపాడగలమా? లేదా తొలగించాల్సి వస్తుందా? అన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు.