Upasana : అలాంటి మహిళలకు నా హెచ్చరిక.. రామ్ చరణ్ భార్య ఉపాసన కామెంట్స్ వైరల్..
Upasana : రామ్ చరణ్ భార్య, అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ ఉపాసన ఓ పక్క బిజినెస్ లతో, పలు సేవా కార్యక్రమాలతో, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లతో, వుమెన్ ఎంపవర్మెంట్ తో బిజీగా ఉంటూనే ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. నేడు ఉపాసన యాంకర్ సుమ నిర్వహిస్తున్న ఫెస్టివల్ ఫర్ జాయిస్ అనే సంస్థ అయిదవ వార్షికోత్సవం

Upasana : రామ్ చరణ్ భార్య, అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ ఉపాసన ఓ పక్క బిజినెస్ లతో, పలు సేవా కార్యక్రమాలతో, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లతో, వుమెన్ ఎంపవర్మెంట్ తో బిజీగా ఉంటూనే ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. నేడు ఉపాసన యాంకర్ సుమ నిర్వహిస్తున్న ఫెస్టివల్ ఫర్ జాయిస్ అనే సంస్థ అయిదవ వార్షికోత్సవం ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ ఈవెంట్లో సుమ గురించి మాట్లాడిన అనంతరం ఉపాసన పలువురు మహిళల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. Also See : Rajeev Kanakala : గుప్త దానాలు చేసింది.. భార్య గురించి మాట్లాడుతూ స్టేజిపై రాజీవ్ ఎమోషనల్.. ఏడ్చేసిన యాంకర్ సుమ ఉపాసన మాట్లాడుతూ.. నా రీసెర్చ్ ఒక విషయం చెప్పింది. బయట చాలా మంది మహిళలు ఉన్నారు. తమ విజయం కోసం ఇతర మహిళలను తొక్కేసే వాళ్ళు. అలాంటి మహిళలకు ఇది నా హెచ్చరిక. మీ విజయం కోసం, లేదా ఒక బలహీనమైన పురుషుడిని మెప్పించడం కోసం మరొక మహిళను తొక్కేయాలని అనుకోవద్దు. చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సక్సెస్ కోసం మరో మహిళకు అన్యాయం చేస్తున్నారు. ఒక మహిళ బాధ ఇంకొక మహిళ సక్సెస్ అవ్వకూడదు. మనం కలిసి ఎదగాలి. కలిసి ఉండాలి. మన మైండ్ సెట్ మారాలి. ఇది నేను నమ్ముతాను అని అన్నారు.