KTR: ‘సిరిసిల్ల నా కులం, తెలంగాణ నా గోత్రం’.. కేటీఆర్ భావోద్వేగ కామెంట్స్!
KTR: రాజకీయ భిక్ష పెట్టిన సిరిసిల్ల ప్రజలను ఏనాటికీ మరువబోనని, తెలంగాణ తన గోత్రమైతే సిరిసిల్ల తన కులమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) భావోద్వేగానికి లోనయ్యారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గంభీరావుపేట మండలం శ్రీగాధ గ్రామస్తులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్ర

KTR: రాజకీయ భిక్ష పెట్టిన సిరిసిల్ల ప్రజలను ఏనాటికీ మరువబోనని, తెలంగాణ తన గోత్రమైతే సిరిసిల్ల తన కులమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) భావోద్వేగానికి లోనయ్యారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గంభీరావుపేట మండలం శ్రీగాధ గ్రామస్తులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రోత్సాహం, ప్రజల ఆశీర్వాదంతోనే తాను ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు. కేసీఆర్ సాధించిన తెలంగాణను, ఆయన సేవలను రాబోయే ఐదువందల ఏళ్లయినా ఎవరూ మరిచిపోలేరని, ఆయన కొడుకుగా తాను ఎంతో గర్వపడుతున్నానని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. School Holidays: ఏపీకి తుఫాను ముప్పు.. నేటి నుంచి స్కూళ్లకు సెలవులు.. అధికారుల కీలక ఆదేశాలు అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడాను.. ఇప్పుడు నన్ను కాపాడాల్సిన బాధ్యత మీదే: పార్టీ బాధ్యతల వల్ల నియోజకవర్గానికి రావడం కొంత తగ్గినా, సిరిసిల్ల అభివృద్ధికి ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇచ్చానని కేటీఆర్ స్పష్టం చేశారు. మండుటెండల్లోనూ ఎగువ మానేరును మత్తడి దూకించిన విషయాన్ని గుర్తు చేస్తూ, “అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడాను, ఇప్పుడు నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది” అని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 2029లో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సిరిసిల్లను రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి వైఖరిపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు.. కాంగ్రెస్ పాలనలో రైతులకు అరిగోస: సిరిసిల్ల పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తన విచిత్రంగా ఉందని కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిధులన్నీ సిరిసిల్లే తీసుకుపోతున్నారని గగ్గోలు పెట్టిన రేవంత్, ఇప్పుడు ఏమీ చేయలేదని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో యూరియా దొరక్క, రైతుబంధు రాక, కరెంట్ కొరతతో పంటలు ఎండిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులకు కారణం ప్రకృతి కరువు కాదని, ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని దుయ్యబట్టారు. కాళేశ్వరంపై కక్ష సాధింపు చర్యలు.. ప్రభుత్వాన్ని హెచ్చరించిన కేటీఆర్: ప్రస్తుత కరువు పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కల్పతరువు లాంటిదని, కానీ కేసీఆర్‌పై కక్షతో రేవంత్ ప్రభుత్వం దానిని పడావు బెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయకపోవడంతో జలాలు ఏపీకి తరలిపోయాయని, చంద్రబాబు 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పానికి నీళ్లు తీసుకెళ్తుంటే, రేవంత్ రెడ్డికి తన సొంత జిల్లాకు నీరందించడం చేతకావడం లేదని దెప్పిపొడిచారు. ప్రభుత్వం తక్షణమే మేల్కొని ప్రజలను కరువు నుంచి కాపాడాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పక్షాన పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.