Dragon : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీకి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్?
Dragon : జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ మూవీపై హైప్ అంతకంతకు పెరుగుతోంది. ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ డైలాగులతో ఆల్రెడీ నాలుగు నిమిషాల నిడివితో గ్లింప్స్ రిలీజ్ చేయడంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అయితే డ్రాగన్ సినిమాకు ఇప్పటికే రవి బసూర్ సంగీతం అందిస

Dragon : జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ మూవీపై హైప్ అంతకంతకు పెరుగుతోంది. ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ డైలాగులతో ఆల్రెడీ నాలుగు నిమిషాల నిడివితో గ్లింప్స్ రిలీజ్ చేయడంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అయితే డ్రాగన్ సినిమాకు ఇప్పటికే రవి బసూర్ సంగీతం అందిస్తున్నారనే ప్రచారం ఉంది. లేటెస్ట్గా శశ్వత్ సచ్దేవ్ పేరు తెరపైకి రావడంతో కొత్త చర్చ మొదలైంది. రవి బసూర్ స్థానంలో శశ్వత్ సచ్దేవ్ వస్తారా.? లేక ఇద్దరు సంగీత దర్శకులు ఈ భారీ ప్రాజెక్ట్‌కు పనిచేయబోతున్నారా.? అన్నది ఆసక్తికరంగా మారింది. Anshu Selvamani : మా చివరి ఇంటర్న్ వేడుక.. రోజా కూతురు అన్షు ఫోటోలు వైరల్.. అటు రవిబసూర్, ఇటు శశ్వత్ సచ్దేవ్..ఇద్దరూ డ్రాగన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తే మాత్రం మరో లెవల్ ఎక్స్‌పరిమెంట్‌కు తెరదీసినట్లేనన్న చర్చ జరుగుతోంది. రవి బాసూర్ మాస్ బీజీఎం, శశ్వత్ సచ్దేవ్ కొత్త తరహా మ్యూజికల్ స్టైల్ కలిస్తే తెరపై ఎలాంటి సౌండ్ మ్యాజిక్ క్రియేట్ అవుతుందనే ఎగ్జైట్మెంట్ కొనసాగుతోంది. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్‌పై ఇప్పటివరకు అధికారిక స్పష్టత లేదు. ప్రస్తుతానికి ఇదంతా ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ మాత్రమే. వార్ 2 ఎన్టీఆర్ అనుకున్నంత హిట్ కాకపోవడంతో డ్రాగన్‌తో మళ్లీ పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నారు. 1967లో ఆఫ్ఘనిస్తాన్ ఉన్న పరిస్థితుల నుంచి నుంచి గోల్డెన్ ట్రయాంగిల్ వరకు నడిచే స్టోరీలో ఎమోషన్, యాక్షన్ ఎక్కువగా ఉండటంతో బీజీఎం..మ్యూజిక్ కీరోల్ ప్లేచేయబోతోందట. అందుకే సంగీతం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు.