Telangana Govt : తెలంగాణలోని మహిళలకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త.. ప్రత్యేక యాప్ సిద్ధం.. అర్హులందరికీ పంపిణీ
Telangana Govt : తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి అనేక చర్యలు చేపడుతోంది. అయితే, తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మహిళలకు శుభవార్త చెప్పింది. Also Read : Rythu Bharosa : రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ‘రైతు భ

Telangana Govt : తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి అనేక చర్యలు చేపడుతోంది. అయితే, తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మహిళలకు శుభవార్త చెప్పింది. Also Read : Rythu Bharosa : రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ‘రైతు భరోసా’ నిధుల విడుదలపై కీలక నిర్ణయం.. వారందరికీ సాయం.. రాష్ట్రంలోని మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమంను ప్రభుత్వం చేపట్టనుంది. ఈనెల 19వ తేదీన దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గురువారం జరిగిన మంత్రిమండలి దీనికి ఆమోదం తెలిపింది. 2026 సంవత్సరానికిగాను రాష్ట్రంలో మహిళలకు ఉచిత చీరల పంపిణీ పథకానికి ప్రభుత్వం రూ.334 కోట్లను కేటాయించిన విషయం తెలిసిందే. గతంలో పాలపిట్ట రంగు చీరలు ఉండగా.. ఈసారి ఎరుపు జరీ అంచు కలిగిన చిలకపచ్చ రంగు చీరను ప్రభుత్వం ఎంపిక చేసింది. మొత్తం 95 లక్షల మందికి చీరలు పంపిణీ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఇప్పటి వరకు 65లక్షల చీరల తయారీ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. వీటిని ఇప్పటికే ఆయా జిల్లాలకు చేర్చారు. ఇదిలాఉంటే.. ఈనెల 19వ తేదీ నుంచి చీరలను తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాల మహిళలకు వారంరోజుల పాటు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక యాప్నుసైతం సిద్దం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పంపిణీ కేంద్రాలు, ఇళ్ల వద్ద మహిళలు తమ ఆధార్ కార్డులను పంచాయతీ అధికారులకు చూపించాల్సి ఉంటుంది. ఆ తరువాత యాప్ ద్వారా ఫొటో తీసుకుని, వివరాలు ధ్రువీకరణ అయిన తర్వాత చీరలు పంపిణీ చేయనున్నారు.